తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైకుంఠపురము నుంచి అదిరిపోయే సర్​ప్రైజ్​

నూతన ఏడాది కానుకగా 'అల.. వైకుంఠపురములో' చిత్రం నుంచి చక్కటి టీజర్ సిద్ధం చేసింది చిత్రబృందం. సామజవరగమన గీతానికి సంబంధించిన వీడియో టీజర్​ను డిసెంబరు 31న విడుదల చేయనుంది.

alavaikunta puram Surprise teaser
అలవైకుంఠ పురములో

By

Published : Dec 29, 2019, 7:08 PM IST

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త చిత్రం 'అల.. వైకుంఠపురములో'. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఏడాదికి సినీప్రియుల కోసం అదిరిపోయే కానుకను సిద్ధం చేసింది చిత్రబృందం. ఇంతకీ అదేంటో తెలుసా.. 2019లో సినీ సంగీత ప్రియుల్ని ఓ ఊపు ఊపిన తన 'సామజవరగమన' గీతానికి సంబంధించిన వీడియో టీజర్‌ను డిసెంబరు 31న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను కూడా ఈ సందర్భంగా ట్విట్టర్లో షేర్‌ చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్‌ ఈఫిల్‌ టవర్‌ ముందు స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం, పూజా హెగ్డే క్యూట్‌ లుక్స్‌తో బన్ని ముందుకు రావడం వంటి సన్నివేశాల్ని చూపించారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యమందించిన ఈ గీతానికి తమన్‌ స్వరాలు సమకూర్చగా సిద్‌ శ్రీరామ్‌ ఎంతో చక్కగా ఆలపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: నెట్టింట వైరల్​గా 'ఆర్​ఆర్​ఆర్' పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details