తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాహుబలి' రికార్డును కొట్టేసిన 'అల వైకుంఠపురములో'

బన్నీ 'అల వైకుంఠపురములో'.. యూఎస్​ ప్రీమియర్స్​లో ఆకట్టుకునే కలెక్షన్లు రాబట్టింది. న్యూజిలాండ్​లో 'బాహుబలి' తొలిరోజు వసూళ్ల రికార్డును అధిగమించింది.

'బాహుబలి' రికార్డును కొట్టేసిన 'అల వైకుంఠపురములో'
'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

By

Published : Jan 12, 2020, 5:03 PM IST

స్టైలిష్ స్టార్ 'అల వైకుంఠపురములో' సినిమా.. నేడు(ఆదివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతకుముందు యూఎస్​ ప్రీమియర్స్​లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. 800k డాలర్ల గ్రాస్​ కలెక్షన్లు సొంతం చేసుకుందని సమాచారం. న్యూజిలాండ్​లోని ప్రీమియర్స్​లో 'బాహుబలి' రికార్డును అధిగమించిందీ చిత్రం. ఇక్కడ బన్నీ తొలిరోజు 34,625 డాలర్లు తెచ్చుకోగా, ప్రభాస్ సినిమా.. 21,290 డాలర్లు సంపాదించింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేశ్​ బాలా ట్విట్టర్​లో వెల్లడించాడు.

సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల్ని అలరిస్తోందీ చిత్రం. సంక్రాంతి పండగ ముందున్న నేపథ్యంలో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను రూపొందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే హీరోయిన్. సుశాంత్, టబు, మురళీ శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన అన్ని పాటలు ఇప్పటికే శ్రోతల మనసులు గెల్చుకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details