స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా చిత్రానికి సంబంధించి మరో టీజర్ విడుదలైంది.
'ఓ మైగాడ్ డాడీ' అంటూ సాగే ఈ పాట టీజర్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్‌తో పాటు కుమార్తె అల్లు అర్హ ముద్దుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బన్నీ సర్‌ప్రైజ్ చాలా క్యూట్‌గా ఉందని అభిమానులు అంటున్నారు. పూర్తి పాటను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.