తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2020, 9:02 PM IST

ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' తొలిరోజు కలెక్షన్లు రూ.85 కోట్లా?

'అల వైకుంఠపురములో' మొదటిరోజు కలెక్షన్లు రూ.85 కోట్లు అంటూ ఓ పోస్టర్​ చక్కర్లు కొడుతోంది.  ఈ విషయంపై చిత్రనిర్మాతలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

'అల వైకుంఠపురములో' తొలిరోజు కలెక్షన్లు రూ.85 కోట్లా?
అల వైకుంఠపురములో సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ఆదివారమే థియేటర్లలోకి వచ్చింది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. అయితే తొలిరోజే రూ.85 కోట్లు గ్రాస్​ వసూలు చేసిందంటూ ఓ పోస్టర్..​ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం వల్ల ఇది అసత్యమేనని(ఫేక్) పలువురు నెటిజన్లు అంటున్నారు.

అల వైకుంఠపురములో తొలి కలెక్షన్లు ఇవే అంటూ ప్రచారమవుతున్న పోస్టర్

అంతకు ముందు వచ్చిన సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర.. ఈవిషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు తొలిరోజు కలెక్షన్ల పోస్టర్(అధికారికం)

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం.. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల గురించి కాకుండా, కలెక్షన్ల కోసం మాట్లాడుకుంటున్నారు. మరికొద్ది రోజుల వరకు ఇది ఆగేలా లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details