తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Siima Awards 2020: 'అల.. సైమాలో' అవార్డులు కొల్లగొట్టి.. - సైమా వేడుక

సైమా అవార్డ్స్​-2020లో(Siima Awards 2020) 'అల.. వైకుంఠపురములో' సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 10 పురస్కారాలను అందుకుంది. 2020 ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(allu arjun awards), ఉత్తమ నటిగా పూజా హెగ్డే నిలిచారు. జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు దక్కింది.

Siima Awards 2020
సైమా

By

Published : Sep 20, 2021, 7:24 AM IST

దక్షిణాది సినీ పురస్కారాల పండగ.. సైమా అవార్డుల వేడుక. ఏటా నాలుగు భాషలకు చెందిన సినీ పరిశ్రమల్ని ఒక చోట చేర్చే ఓ అరుదైన వేదిక. తారల తళకు బెళుకులు.. ఆత్మీయ పలకరింపులతో సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఆవార్డ్స్‌)-2020 (Siima Awards 2020) సంబరం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై 'అల.. వైకుంఠపురములో' (Ala Vaikunthapurramuloo Awards) పది పురస్కారాల్ని గెలిచి సత్తా చాటింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డు (allu arjun awards) అందుకున్నారు.

సైమా వేడుకలో అల్లు అర్జున్

జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు అందజేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఈ వేడుకలో ఖుష్బు, సుహాసిని, రాధిక, పూజా హెగ్డేతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారలు పాల్గొన్నారు.

'అల.. వైకుంఠపురములో' టీమ్​

2020 సైమా విజేతల వివరాలివీ..

  • ఉత్తమ చిత్రం - అల వైకుంఠపురములో
  • ఉత్తమ దర్శకుడు - త్రివిక్రమ్ (అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ నటుడు - అల్లు అర్జున్​ (అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్) - సుధీర్​బాబు(వి)
  • ఉత్తమ నటి - పూజా హెగ్డే (అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ నటి(క్రిటిక్స్​) - ఐశ్వర్యా రాజేశ్​(వరల్డ్​ ఫేమస్​ లవర్​)
  • ఉత్తమ సహ నటుడు - మురళీశర్మ(అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ సహనటి - టబు(అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్​(అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ గీత రచయిత - రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ పాటకి..(అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ ఛాయాగ్రాహకుడు - రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)
  • ఉత్తమ హాస్యనటుడు - వెన్నెల కిశోర్​ (భీష్మ)
  • ఉత్తమ గాయకుడు - అర్మాన్​ మాలిక్​ (బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
  • ఉత్తమ గాయని - మధుప్రియ(హి ఈజ్​ సో క్యూట్​.. సరిలేరు నీకెవ్వరు)
  • ఉత్తమ ప్రతినాయకుడు - సముద్రఖని(అల.. వైకుంఠపురములో)
  • ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడు - శివ కందుకూరి(చూసీ చూడంగానే)
  • ఉత్తమ తొలి చిత్ర కథానాయిక - రూప కొడవాయూర్(ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
  • ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు- కరుణకుమార్ (పలాస)
  • ఉత్తమ తొలి చిత్ర నిర్మాత - (అమృత ప్రొడక్షన్స్​- లౌక్య ఎంటర్​టైన్​మెంట్స్​- కలర్​ఫోటో)

ఇదీ చదవండి:This Week Movie Releases: ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details