Ala Vaikunthapurramloo Hindi version release date: 'పుష్ప' సినిమా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజై దాదాపు రూ.80 కోట్ల మేర వసూళ్లు సాధించింది. అంతేకాదు, ఈ సినిమాతో బన్నీకి బీ టౌన్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇదే ఊపును కొనసాగించేందుకు అల్లు అర్జున్.. తివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని గోల్డ్‌మైన్స్ పిక్చర్స్ నిర్ణయించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు గోల్డ్ మైన్స్ ప్రకటించింది.
'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జోడీగా రీమేక్ చేశారు. దీనికి 'షెహజాదా' అని టైటిల్ ఖరారు చేశారు. అలవైకుంఠపురములో డబ్బింగ్ చిత్రం ఈ సమయంలో విడుదలైతే షెహజాదాకు తీవ్ర నష్టం నష్టం కలుగుతుందని నిర్మాతలు భావించారు.