టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. తాజాగా సినిమా టీజర్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. గతంలో డిసెంబరు 8న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చెప్పినా.. మెగా ఫ్యామిలీ అభిమాని, ఆప్తుడు నూర్ భాయ్ మృతితో షెడ్యూల్‌ను వాయిదా వేశారు. మళ్లీ టీజర్ విడుదల ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల్లో సందడి నెలకొంది.
ఆ రోజే అల్లు అర్జున్ సినిమా టీజర్.. - 2020 సినిమా వార్తలు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీలో హీరో. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.
బన్నీ కెరీర్ 19వ చిత్రంగా 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రంలోని 'సామజవరగమన' పాట వందమిలియన్ వ్యూస్ సాధించిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.