స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. సినిమాకు సంబంధించిన 'బుట్ట బొమ్మ' అనే సాంగ్ టీజర్‌ను విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. త్వరలోనే సినిమా విశేషాలు పంచుకుంటామని వెల్లడించింది.
'బుట్టబొమ్మ' సాంగ్ టీజర్ వాయిదా - butta bomma song
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. నేడు రావాల్సిన 'బుట్ట బొమ్మ' సాంగ్ టీజర్‌ను..సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.
బన్నీ కెరీర్లో 19వ చిత్రంగా 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన సినిమా టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.