తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూరప్​ షూటింగ్​లో 'అల వైకుంఠపురములో'..! - allu arjuns ala vaikuntapuramulo

'అల వైకుంఠపురములో' చిత్రబృందం యూరప్ పయనమైంది. అక్కడ బన్నీ, పూజా హెగ్డేలపై ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.

అల్లు

By

Published : Nov 3, 2019, 12:38 PM IST

Updated : Nov 3, 2019, 6:46 PM IST

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఇప్పటికే బ్యాక్​ టు బ్యాక్​ సాంగ్స్​ విడుదల చేసి సినిమాపై అంచానాల్ని పెంచేసింది చిత్రబృందం. ఇక మిగిలిన పాటల చిత్రీకరణ కోసం యూనిట్​ యూరప్ వెళ్లింది. అక్కడ బన్నీ, పూజా హెగ్డే మధ్య ఓ మంచి రొమాంటిక్ సాంగ్​ను చిత్రీకరించనున్నారని సమాచారం.

యూరప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మరో లిరికల్ వీడియోను విడుదల చేయాలని భావిస్తున్నారట త్రివిక్రమ్​. మూడో పాట కూడా హిట్ అయితే, సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తోంది. ఈ నటి లుక్​ను ఆమె పుట్టినరోజు (నవంబర్​ 4న) కానుకగా విడుదల చేయనుంది చిత్రబృందం.

టబు

సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, సునీల్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి... తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవీ చూడండి.. కేరళకు పయనమైన 'సరిలేరు నీకెవ్వరు'

Last Updated : Nov 3, 2019, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details