తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' ఖాతాలో ఐదోసారి 10 కోట్ల వీక్షణలు - అల వైకుంఠపురములో

స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్​, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది విడుదలైన సినిమా మంచి వసూళ్లు రాబట్టగా.. పాటలు నెట్టింట రికార్డుల మీద రికార్డులు ఖాతాలో వేసుకుంటున్నాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందామా..

ala vaikuntapuramulo news
'అల వైకుంఠపురములో' ఖాతాలో మరో 10 కోట్ల వీక్షణలు

By

Published : Jul 29, 2020, 7:00 AM IST

ఒకప్పుడు సినిమా పాటలు హిట్‌ అని చెప్పాలంటే.. ఎన్ని కేసెట్లు అమ్ముడయ్యయో లెక్క చూసేవారు. ఆ తర్వాత సీడీలు వచ్చాక ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్లు చేసేవారు. ఇప్పుడు లెక్క మారింది... అంతా మిలియన్ల మీదే లెక్కేస్తున్నారు. యూట్యూబ్‌లో ఆ పాటకు ఎన్ని వ్యూస్‌ (వీక్షణలు) వచ్చాయి అనేదే కొలమానంగా మారింది. అలాంటి కొలమానంలో 'అల వైకుంఠపురములో' కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో ఐదు పాటలు వంద మిలియన్ల మార్కును దాటాయి.

ఈ సినిమాకు సంబంధించిన వివిధ ఫంక్షన్లలో చిత్రబృందం చెప్పినట్లు... సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లింది... ప్రజలను సినిమాకు తీసుకొచ్చింది తమన్‌ సంగీతమే. అందుకే సినిమా పాటలు అన్ని వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. అల్లు అర్జున్‌ చాలా గ్యాప్‌ అతర్వాత చేసిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్‌ చెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం అందుకుంది. పూజా హెగ్డే అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

'సామజవరగమన...' ప్రమోషనల్‌ సాంగ్‌, 'రాములో రాముల..' ప్రమోషనల్‌ సాంగ్‌, ఫుల్‌ వీడియో సాంగ్‌, 'బుట్టబొమ్మ...' పాటలు ఇప్పటికే 10 కోట్ల వ్యూస్‌ దాటగా... తాజాగా 'సామజవరగమన...' ఫుల్‌ వీడియో సాంగ్‌ 10 కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం ఏ పాటకు ఎన్ని వ్యూస్‌ వచ్చాయో చూడండి.

'సామజవరగమన...' ప్రమోషనల్‌ సాంగ్‌ (19.9 కోట్లకు పైగా వ్యూస్​‌)

'రాములో రాముల...' ప్రమోషనల్‌ సాంగ్‌ (29 కోట్లకు పైగా వ్యూస్‌)

'రాములో రాముల...' ఫుల్‌ వీడియో సాంగ్‌ (16 కోట్లకు పైగా వ్యూస్‌)

'బుట్ట బొమ్మ...' ఫుల్‌ వీడియో సాంగ్‌ (29 కోట్లకు పైగా వ్యూస్‌)

'సామజవరగమన...' ఫుల్‌ వీడియో సాంగ్‌ (10 కోట్లకు పైగా వ్యూస్‌)

ABOUT THE AUTHOR

...view details