తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రివిక్రమ్​ 'అల..వైకుంఠపురములో' కాపీ చిత్రమా? - తెలుగు తాజా సీనిమా వార్తలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జన్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. ఈ సినిమాకు ఆనాటి ఎన్టీఆర్​ చిత్రం 'ఇంటిగుట్టు'తో పోలికలున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీనే నేటి తరానికి తగ్గట్లు మార్చి త్రివిక్రమ్​ కొత్తగా తీస్తున్నాడని వినికిడి.

ala vaikuntapuramulo movie looking like a ntr movie talking at cine industry
ఎన్టీఆర్​ చిత్రానికి పోలికగా 'అల..వైకుంఠపురములో'?

By

Published : Nov 30, 2019, 10:01 PM IST

అల్లు అర్జన్​- త్రివిక్రమ్​ కాంబినేషన్​లో సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్ల తర్వాత త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ల కలయికలో వస్తున్న చిత్రం కావడం విశేషం. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలు సినీప్రియుల్లో మంచి ఆదరణ పొందాయి.

ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కథకు అలనాటి ఎన్టీఆర్‌ చిత్రం 'ఇంటిగుట్టు'కు పోలికలున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు ఆ సినిమా కథనే నేటి తరానికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రహస్యం బయటకి పొక్కడానికి ఆయన దగ్గర పనిచేస్తున్న సహాయకులే కారణమని, వారు మూల కథను లీక్‌ చేసినట్లు తెలిసి త్రివిక్రమ్‌ ఆగ్రహాం చెందినట్లు సినీ వర్గాల్లో టాక్​. మరి వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే మాటల మాంత్రికుడు మనసు విప్పే వరకు వేచి చూడక తప్పదు.

ABOUT THE AUTHOR

...view details