బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సూర్యవంశీ' చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అందుకు కారణాలను తెలుపలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.
అక్షయ్ సినిమా వాయిదా- షూటింగ్లో రకుల్ ప్రీత్ - అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా రిలీజ్ వాయిదా
అక్షయ్‌కుమార్ నటించిన 'సూర్యవంశీ' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న కొత్త హిందీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
అక్షయ్
రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా జంటగా తెరకెక్కుతున్న సినిమా 'డాక్టర్ జీ. సోమవారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినట్లు తెలిపింది రకుల్. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ వైద్య విద్యార్థులుగా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనుభూతి కష్యప్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి:అక్కడా తెలుగులోనే మాట్లాడతా: రకుల్‌ప్రీత్
TAGGED:
సూర్యవంశీ రిలీజ్ వాయిదా