తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా కట్టడికి అక్షయ్, ట్వింకిల్ సాయం - ట్వింకిల్ ఖన్నా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్

కరోనా సెకండ్​వేవ్ దేశంలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి సాయం అందించడానికి ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను అందిస్తున్నట్లు ప్రకటించారు.

Akshay, Twinkle
అక్షయ్, ట్వింకిల్

By

Published : Apr 28, 2021, 9:11 PM IST

కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. సెకండ్‌వేవ్‌తో దేశం తీవ్ర విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా బారినపడ్డ ఎంతోమంది అభాగ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా.. బాలీవుడ్‌ జంట అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా తమ దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల అక్షయ్‌కుమార్‌ భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఫౌండేషన్‌కు రూ.కోటి విరాళంగా ప్రకటించారు. మరోసారి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. కరోనాతో పోరులో భాగంగా తమవంతుగా ఈ సాయం చేస్తున్నట్లు అక్షయ్‌ సతీమణి ట్వింకిల్‌ఖన్నా పేర్కొన్నారు.

ట్వింకిల్ ట్వీట్

"నా సొంత కుటుంబ సభ్యుల అనారోగ్యం వల్ల కొన్ని వారాలుగా కరోనా బాధను నేను కూడా అనుభవించా. కానీ.. నేను అందులో ఎక్కువ రోజులు ఉండలేకపోయా. దైవిక్ ఫౌండేషన్ ద్వారా లండన్ ఎలైట్ హెల్త్‌కు చెందిన డాక్టర్ ద్రష్నికా పటేల్‌, డాక్టర్ గోవింద్ బంకాని 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ దానం చేశారు. అక్షయ్‌కుమార్‌, నేనూ మరో 100 ఇస్తున్నాం. మొత్తంగా 220 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ ఇవ్వగలిగాం. అందుకే మీ అందర్నీ వేడుకుంటున్నా.. మీకు తోచినంత సాయం చేయండి" అని ట్వింకిల్ పేర్కొంది. ఇటీవల కరోనాకు గురైన అక్షయ్‌ ముంబయిలో చికిత్స పొంది ఈ మధ్యే కోలుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details