తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డింపుల్​కు 'నోలన్' లేఖ.. షేర్​ చేసిన అక్షయ్ - క్రిస్టోఫర్​ లేఖ

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్​ నోలన్.. బాలీవుడ్ నటి డింపుల్​ కపాడియాకు రాసిన లేఖను ఇన్​ స్టా వేదికగా పంచుకున్నాడు నటుడు అక్షయ్ కుమార్. ప్రముఖ దర్శకుడి నుంచి తన అత్తకు ఈ లేఖ రావడంపై హర్షం వ్యక్తం చేశాడు.

Akshay kumar
డింపుల్​కు 'నోలాన్' లేఖ... షేర్​ చేసిన అక్షయ్

By

Published : Dec 5, 2020, 9:56 PM IST

హాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్​ తన అత్తకు లేఖ రాయడంపై హర్షం వ్యక్తం చేశాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. నోలన్​ దర్శకత్వం వహంచిన 'టెనెట్' సినిమాలో నటించింది అక్షయ్ అత్త డింపుల్ కపాడియా. ఈ సినిమా శుక్రవారం.. థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో కపాడియాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశాడు నోలన్. ఈ ఉత్తరాన్ని ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు అక్షయ్.

లేఖలో ఏముంది?

"డింపుల్.. మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. 'టెనెట్'​లో మీరు నటించిన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. మీ పనితనానికి ధన్యవాదాలు." అని లేఖలో రాశాడు నోలన్.

ఆనందంలో అక్షయ్..

ఈ లేఖను ఇన్​స్టా వేదికగా పంచుకున్న అక్షయ్.. డింపుల్​కు అల్లుడిని అయినందుకు గర్వంగా భావిస్తున్నా అని వెల్లడించాడు. 'టెనెట్'​లో డింపుల్ నటించిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఈ సందర్భంగా నోలన్, డింపుల్​ కలిసి దిగిన ఫొటోను షేర్​ చేశాడు.

ఇదీ చదవండి:'టెనెట్​' సినిమాలో ఆఫర్.. ప్రాంక్​ కాల్ అనుకున్నా!

ABOUT THE AUTHOR

...view details