తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సందేశాలకు బదులు సాయం​ చేయండి: అక్షయ్

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​ అసోంలో వరద బాధితులకు ఇటీవల రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులు తోచిన సాయం చేయాలని కోరాడు. అయితే ఆ సందేశాలు చక్కర్లు కొట్టినా ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం మాత్రం రాకపోవడం ఈ స్టార్​ హీరోను నిరాశపరిచింది.

సందేశాలకు బదులు సాయం​ చేయండి: అక్షయ్​ కుమార్​

By

Published : Jul 20, 2019, 6:00 AM IST

అసోం వరదలతో నిరాశ్రయులైన వారికోసం ఇటీవల బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రూ.2 కోట్లు విరాళం ఇచ్చాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, జాతీయ ఉద్యానం సంరక్షణకు మరో రూ.కోటి ఇస్తున్నట్లు బుధవారం వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. అందరూ తమ వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరాడు. ప్రస్తుతం అతడు మిషన్​ మంగళ్​ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓ సందేశంతో అభ్యర్థించాడు.

" సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన మెసేజ్​లు పోస్టు చేయడం కన్నా అసోం ప్రజలకు కాస్త సాయం చేయండి. మీకు తోచింది ఏదైనా పర్లేదు వారికి అందించండి. ఫలితంగా బాధితులకు కాస్త ఉపశమనం లభిస్తుంది ".
--అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ హీరో

ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవితాధారంగా ప్రముఖ దర్శకుడు జగన్‌శక్తి తెరకెక్కించిన చిత్రం 'మిషన్‌ మంగళ్‌'. టైటిల్‌ పాత్రను అక్షయ్‌ కుమార్‌ పోషిస్తుండగా.. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్, తాప్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారత్‌ 2013లో చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ మిషన్‌ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగుతుంది. ఆగస్ట్​ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి...అసోం, బిహార్ వరదల్లో 94కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details