బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అప్పుడే అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' కూడా రావాల్సి ఉంది. అయితే ఆమిర్ విజ్ఞాపన మేరకు అక్కీ తన చిత్రాన్ని వచ్చే జనవరికి వాయిదా వేసుకున్నాడు. ఈ కారణంగా క్రిస్మస్కు ఆమిర్ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి, అక్షయ్, 'బచ్చన్ పాండే' చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు ఆమిర్.
'లాల్ సింగ్ చద్దా'లో తమిళ నటుడు విజయ్ సేతుపతి, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్. హాలీవుడ్ చిత్రం 'ద ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.