అత్యధిక పారితోషకం అందుకుంటున్న ఫోర్బ్స్-100 మంది సెలబ్రిటీల తాజా జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. ఇందులోని ఏకైక భారతీయుడు ఇతడే కావడం విశేషం.
జూన్ 2019- మే 2020 మధ్య కాలంలో సంపాదించిన ఆదాయంను లెక్కించి, ఈ జాబితాను తయారు చేశారు. ప్రస్తుతం 52వ స్థానం సొంతం చేసుకున్న అక్షయ్, రూ.366 కోట్లు సంపాదించాడు. గతేడాదితో పోల్చితే 19 స్థానాలు దిగజారాడు. కరోనా ప్రభావమే ఈ హీరో ఆదాయం తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది.