బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, లారా దత్తా, హ్యూమా ఖురేషి, ఆదిల్ హుస్సెన్‌లు గురువారం ముంబయి విమానాశ్రయంలో తళ్లుక్కుమని మెరిశారు. వీరందరూ కలిసి 'బెల్‌బాటమ్' చిత్ర షూటింగ్ కోసం బ్రిటన్ బయలుదేరారు. గ్లాస్గో, స్కాట్లాండ్లో వీరు షూటింగ్ చేయనున్నారు. కరోనా వైరస్ భయాలను జయించి వీరందరూ కలిసి లాక్డౌన్ అనంతరం తొలిసారి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు.
అక్షయ్.. తన భార్య, నటి ట్వింకిల్ ఖన్నా, పిల్లలు ఆరవ్, నితారాతో కలిసి విమానం ఎక్కాడు. లారా వెంట భర్త, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, కుమార్తె సైరా ఉన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే వీరందరూ బ్రిటన్‌కు బయలుదేరారు.