తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సూర్యవంశీ', '83' విడుదలపై క్లారిటీ - సూర్య వంశీ విడుదల

అక్షయ్ కుమార్ సూర్యవంశీ, రణ్​వీర్ సింగ్ 83 చిత్రాల విడుదల తేదీలపై ఓ క్లారటీ వచ్చింది. సూర్యవంశీ దీపావళికి, 83 క్రిస్మస్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Akshay Kumar's Sooryavanshi, Ranveer Singh's 83 set for theatrical release
'సూర్యవంశీ', '83' విడుదలపై క్లారిటీ

By

Published : Jun 30, 2020, 6:59 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా వేసవిలో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలుగా రిలీజయ్యేందుకు ముస్తాబవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన అక్షయ్‌ కుమార్‌ 'సూర్యవంశీ', రణ్‌వీర్‌ సింగ్‌ '83' చిత్రాలు కూడా ఈ వేసవిలో సందడి చేయాల్సి ఉంది. విడుదల తేదీలు కూడా ఖరారైన తర్వాత.. కరోనా కారణంగా ఆగిపోయాయి. ఒకానొక దశలో ఈ రెండూ ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వేదికగా విడుదల చేస్తారని టాక్‌ వినిపించింది. అయితే, ఆ వార్తలను చిత్ర బృందాలు ఖండించాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాల విడుదలపై స్పష్టత వచ్చింది.

దీపావళికి అక్షయ్‌ సినిమా

అక్షయ్‌ కుమార్‌, కత్రినాకైఫ్‌, అజయ్‌ దేవగణ్‌, రణవీర్‌ సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్యవంశీ'. రోహిత్‌శెట్టి దర్శకుడు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు పీవీఆర్‌ సినిమాస్‌ వెల్లడించింది. యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తానిష్‌ బాగ్చి సంగీతం అందించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై యశ్‌ జోహార్‌, అరుణ్‌ భాటియా, కరణ్‌ జోహర్‌, అపూర్వ మెహతా, రోహిత్‌శెట్టి నిర్మించారు.

క్రిస్మస్‌కు కపిల్‌ బయోపిక్‌

భారత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం '83'. క్రికెట్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు. కపిల్‌దేవ్‌ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె కనిపించనుంది. ఏప్రిల్‌ 10న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పీవీఆర్‌ సినిమాస్‌ ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details