సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్య కేసులో నటి రియా చక్రవర్తి కెనడాకు పారిపోవడానికి అక్షయ్ కుమార్ సహాయం చేశాడని ఓ యూట్యూబర్ ఆరోపించాడు. దీనిపై కోర్టును ఆశ్రయించిన అక్షయ్.. యూట్యూబర్ రషీద్ సిద్దిఖీపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ఇదే యూట్యూబర్ సుశాంత్ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపైనా గతంలో ఆరోపణలు చేయగా.. పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై తిరిగి బయటకు వచ్చాడు. అయితే ఈ కేసులో రియాకు అక్షయ్ సహాయం చేస్తున్నాడని.. నటి కెనడా వెళ్లడానికి ఉద్ధవ్, ఆదిత్యలతో అక్షయ్ మంతనాలు జరిపాడని రషీద్ ఆరోపించాడు.