బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'లక్ష్మీబాంబ్'. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర విడుదల తేదీ.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసుకుంది. దీపావళి కానుకగా నవంబరు 9న సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అక్షయ్ 'లక్ష్మీ బాంబ్' పేలేది ఆ రోజే.. - 'Laxmmi Bomb' to release on Diwali
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ జంటగా నటించిన 'లక్షీబాంబ్' సినిమా ఓటీటీలోనే సందడి చేయనుంది. ఇవాళ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది నవంబరు 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
లక్ష్మీ బాంబ్
ఈ సినిమా దక్షిణాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన 'కాంచన'కు హిందీ రీమేక్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అక్షయ్ సరసన కియారా అడ్వాణీ నటించింది.
ఇదీ చూడండి హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్