తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దు పెట్టలేదు.. బ్రేకప్​ చెప్పేసింది: అక్షయ్ - akshay kumar housefull 4 promotions

గతంలో తనకున్న లవ్​స్టోరీ గురించి బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ముద్దు పెట్టని కారణంగా ప్రియురాలు తనను విడిచిపెట్టినట్లు తెలిపాడు.

Akshay Kumar's first girlfriend dumped him for this reason
'సిగ్గుతో ముద్దు పెట్టలేదు.. బ్రేకప్​ చెప్పేసింది'

By

Published : Jan 20, 2021, 10:35 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌, నటి ట్వింకిల్‌ ఖన్నాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట 20వ వివాహ వార్షికోత్సవం ఇటీవల జరిగింది. అయితే, ట్వింకిల్‌ ఖన్నా కంటే ముందు తన జీవితంలో ఓ బ్రేకప్‌ జరిగిందని.. ఒకానొక సందర్భంలో అక్షయ్‌ వివరించాడు. గతంలో 'కపిల్ శర్మ' షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయం చెప్పాడు.

'ఒకానొక సమయంలో నేనొక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనను రెస్టారెంట్లు, సినిమాలకూ తీసుకెళ్లేవాడిని. అలా మేమిద్దరం నాలుగుసార్లు డేట్‌కు వెళ్లాం. అయితే, అప్పట్లో నాకున్న సిగ్గు కారణంగా.. నేను ఆమెను ఒక్కసారి కూడా తాకలేదు. కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. దీంతో ఆ అమ్మాయి.. ఏ విధంగానూ నేను ప్రేమ చూపించడంలేదని నాకు బ్రేకప్ చెప్పేసింది' అని‌ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు అక్షయ్.

ఇదీ చదవండి:ఐదు రోజుల్లో 7లక్షల మందికి కరోనా టీకా

ABOUT THE AUTHOR

...view details