బాలీవుడ్ సినిమా 'బెల్‌బాటమ్' బృందానికి హీరోయిన్ దొరికేసింది. 'వార్'తో మెప్పించిన వాణీ కపూర్.. ఈ సినిమా కోసం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో తెర పంచుకోనున్నట్లు వెల్లడించింది. ఇదే విషయమై మాట్లాడిన దర్శకుడు రంజిత్.. ఆమె పాత్ర చాలా బాగా తీర్చిదిద్దామని అన్నారు.
గతేడాది వచ్చిన కన్నడ 'బెల్‌బాటమ్'కు రీమేక్ ఈ సినిమా. మాతృకలో రిషభ్‌శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో కథానాయకుడు డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు.