బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తోన్న నటుడు అక్షయ్ కుమార్. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ హీరో చేసిన యాక్షన్ కామెడీ సినిమా 'రౌడీ రాఠోడ్'. తెలుగులో వచ్చిన 'విక్రమార్కుడు' మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ రాబోతోందని సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
హిందీలో మళ్లీ 'జింతాతా చితా చితా'...! - akshay kumar
అక్షయ్ కుమార్ హీరోగా, ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'రౌడీ రాఠోడ్'. ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రానుందని సమాచారం.
'రౌడీ రాథోర్'కు సీక్వెల్ రాబోతుందా..?
అక్షయ్ కుమార్ కొంతకాలంగా సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సూర్యవంశ్'’ అనే చిత్రంలో నటిస్తున్నాడీ హీరో. ఇందులో కత్రినాకైఫ్ హీరోయిన్.
ఇవీ చూడండి.. మెగా హీరో సినిమాలో అక్కినేని హీరో