బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. కోట్లల్లో రెమ్యూనరేషన్, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, స్టేజ్ షోలు చేస్తూ ఫోర్బ్స్ జాబితాలోనూ స్థానం సంపాదించాడు. కాని ఒకప్పుడు మాత్రం రైలులో ప్రయాణించేందుకూ ఈ నటుడి దగ్గర డబ్బులేవట. 'హౌసపుల్ 4' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కపిల్‌శర్మ షోలో పాల్గొన్న అక్షయ్.. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మహారాష్ట్రలోని మాథెరన్ హిల్స్టేషన్కు వెళ్లిన అక్షయ్.. తిరిగి రావడానికి డబ్బుల్లేవు. చివరకు ఏమైతే అది అవుతుందని ఏడుగురు స్నేహితులు ఒకే టికెట్ కొని రైలులో ప్రయాణించారు. అదృష్టం ఏంటంటే టీసీ వీళ్లని పట్టించుకోలేదు.