తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫృథ్వీరాజ్'​ చౌహాన్​గా బాలీవుడ్​ సూపర్​స్టార్​ - అక్షయ్ కుమార్​ 'పృథ్వీరాజ్'​

మరో ఆసక్తికర బయోపిక్​లో నటిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్​. 'పృథ్వీరాజ్'​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.

'ఫృథ్వీరాజ్'​ చౌహాన్​గా అక్షయ్ కుమార్

By

Published : Sep 9, 2019, 12:22 PM IST

Updated : Sep 29, 2019, 11:28 PM IST

బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అక్షయ్​కుమార్​ వరుస బయోపిక్​లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి', 'మిషన్ మంగళ్'తో అలరించిన ఈ కథానాయకుడు.. చారిత్రక నేపథ్యమున్న జీవిత చరిత్రలో, 'పృథ్వీరాజ్​ చౌహాన్'​ అనే రాజు పాత్రలో కనిపించనున్నాడు. సోమవారం తన 52వ పుట్టినరోజు సందర్భంగా టైటిల్​ను 'పృథ్వీరాజ్'​గా ప్రకటిస్తూ.. వచ్చే ఏడాది దీపావళికి తెస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

"అత్యంత ధైర్యంగా శత్రువుల్ని ఎదుర్కొన్న రాజుల్లో పృథ్వీరాజ్​ చౌహాన్​ ఒకరు. ఇలాంటి నిజమైన దేశభక్తుల్ని తప్పకుండా గుర్తుతెచ్చుకోవాలి. ఈ బయోపిక్స్​తో రాబోయే తరాలు స్ఫూర్తి పొందుతాయి. నా పుట్టిన రోజున ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది." -అక్షయ్​ కుమార్​, హీరో

ఈ సినిమాకు 'మొహల్లా ఆసీ' ఫేమ్​ చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రఖ్యాత యశ్​రాజ్​ ఫిల్మ్స్​ బ్యానర్​ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: అవన్నీ కల్పితాలే.. నమ్మకండి: షారుఖ్

Last Updated : Sep 29, 2019, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details