బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్(akshay kumar new movie).. ఇప్పటికే విభిన్న జానర్స్‌లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దసరా సందర్భంగా శుక్రవారం ప్రకటించిన కొత్త సినిమాలో మేజర్ జనరల్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు 'గోర్ఖా' టైటిల్ పెట్టడమే కాకుండా ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు.
భారత ఆర్మీ మేజర్ ఇయాన్ కర్డోజో జీవితం ఆధారంగా ఈ సినిమాను(akshay kumar new movie) తెరకెక్కిస్తున్నారు. ఆయన పాత్రలో అక్షయ్ నటించనున్నారు. 1962, 1965 1971 ఇండో-పాక్ యుద్ధంలో మేజర్ ఇయాన్ భాగమయ్యారు. అత్యుత్తమ సేవలకుగాను ఈయన సేనా పతాకం కూడా అందుకుని ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచారు.