బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ పెంచేశారట! 2022లో విడుదలయ్యే తన చిత్రాలకు రూ.135 కోట్లు చొప్పున తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఆయన సన్నిహితులు మాత్రమే ఈ విషయం నిజమేనని అంటున్నారు.
అయితే అక్షయ్ రూ.200 కోట్లకు పారితోషికం చేరుకున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అక్షయ్‌కు నిర్మాతలు అంతమొత్తం ఎందుకు ఇస్తున్నారు?
అక్షయ్ సినిమా అంటే వేగంగా పూర్తవుతుంది, మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంది, ఎలాంటి కథలోనైనా సరే ఇమడగలరు అనే కారణాల వల్ల నిర్మాతలు ఆయనతో కలిసి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
జనవరి నుంచి 'బచ్చన్ పాండే' షూటింగ్