32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లాను కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. గతంలోని ఆ వీడియోను మరోసారి చూసేయండి.
వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్ కుమార్ - వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్
అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్.. ముంబలో ప్రస్తుతముంటున్న బంగ్లా వెనుక ఓ ఆసక్తికర విషయం దాగుంది. స్వయంగా అక్షయ్ దానిని గతంలో వెల్లడించారు.
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు తాను ముంబయిలో ఓ ఫొటోగ్రాఫర్ దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడినని చెప్పారు అక్షయ్. 4-5 నెలలు జీతానికి బదులుగా తనకు ఫొటోషూట్ చేసిపెట్టమని ఆయన్ని అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జుహూ బీచ్ దగ్గర్లోని ఓ బంగ్లాను చూశారు. దాని పిట్టగోడపై అక్షయ్ ఉండగా, నాలుగైదు ఫొటోలు తీశారు. ఇంతలో వాచ్‌మన్ వచ్చి వారిని వెళ్లగొట్టాడు. ఇప్పుడు సరిగ్గా అదే చోట కట్టిన బంగ్లాలో తాను ఉంటున్నట్లు అక్షయ్ తెలిపారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఫొటోలను కలిపి చూపించారు.
అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన 'లక్ష్మీబాంబ్' విడుదల కావాల్సి ఉంది. 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్' రీమేక్‌తో పాటు 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ కథానాయకుడు.