32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లా కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు తాను ముంబయిలో ఓ ఫొటోగ్రాఫర్ దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడినని చెప్పారు అక్షయ్. అయితే 4-5 నెలలు జీతానికి బదులుగా తనకు ఫొటోషూట్ చేసిపెట్టమని ఆయన్ని అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జుహూ బీచ్ దగ్గర్లని ఓ బంగ్లాను చూశారు. దాని పిట్టగోడపై అక్షయ్ ఉండగా, నాలుగైదు ఫొటోలు తీశారు. ఇంతలో వాచ్‌మన్ వచ్చి వారిని వెళ్లగొట్టాడు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే చోట కట్టిన బంగ్లాలో తాను ఉంటున్నట్లు అక్షయ్ తెలిపారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఫొటోలను కలిపి చూపించారు. ఈ విషయమై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అక్షయ్ నటించిన 'లక్ష్మీబాంబ్' విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటే 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్' రీమేక్‌తో పాటు 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ కథానాయకుడు.
ఇవీ చదవండి: