తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క డ్యాన్స్​కు కోట్లలో.. ఈ స్టార్స్ డిమాండే వేరయా! - హృతిక్ రోషన్

సినీ తారలకు ఉండే క్రేజే వేరు. కొందరు నటులనైతే ఏకంగా ఆరాధిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారైనా కలవాలని, ఫొటో దిగాలను ఆశపడుతుంటారు. ఇంకా డబ్బున్నవారైతే ఏకంగా తమ పెళ్లిలో సినీతారలతో డ్యాన్స్ చేయిస్తారు. మరి అలాంటి ఫంక్షన్లలో పాల్గొంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత తీసుకుంటారో తెలుసా?

bollywood stars charge per event
కత్రీనా కైఫ్

By

Published : Sep 13, 2021, 9:33 AM IST

భారత్​లో సినీ తారలను ఆరాధ్యులుగా కొలుస్తారు. వారిని కలవడానికి వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇంట్లో ఫంక్షన్​కు వారు అతిథులుగా వచ్చి చిందేస్తే ఎంత బాగుండూ అనుకుంటూ కలలుకనేవారూ లేకపోలేదు. అయితే ఆ కల నిజం చేసుకోవాలంటే వారి 'వెల' తెలియాలి. ఒక్కో ప్రైవేటు ఈవెంటులో డ్యాన్స్ చేయడానికి ఈ బాలీవుడ్​ నటులు ఎంత తీసుకుంటారంటే..?

1. అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉంటారు అక్షయ్ కుమార్. ఎలాంటి కార్యక్రమంలో అయినా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ హుషారు తెప్పిస్తుంటారు. ఈ ఖిలాడీ కుమార్​.. ఒక్కో ఈవెంట్​కు రూ.2.5 కోట్లు తీసుకుంటారని సమాచారం.

2. షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ స్టైలే వేరు. ఉత్సవాల్లో తనదైన శైలిలో హాస్యం పండిస్తూ అలరిస్తారు. 'పఠాన్​' చిత్రీకరణలో ఉన్న షారుక్.. త్వరలోనే అట్లీ, రాజ్​కుమార్​ హీరాణీలతో సినిమాలు చేయనున్నారు. ఈయన ఒక్క ఈవెంట్​కు రూ. 3కోట్లు తీసుకుంటారని వినికిడి.

3. సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

కండలవీరుడు సల్మాన్​ ఖాన్​కు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఒక్క ఈవెంట్​లో డ్యాన్స్​ చేయడానికి రూ.2 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం 'టైగర్​ 3' షూటింగ్​లో బిజీగా ఉన్నారు సల్మాన్.

4. కత్రినా కైఫ్

కత్రీనా కైఫ్

బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ అంటే కుర్రకారు పడిచచ్చిపోతారు. ప్రస్తుతం 'ఫోన్​ భూత్'​, 'టైగర్​ 3' చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఒక్క డ్యాన్స్ ఈవెంట్​కు రూ. 3.5 కోట్లు తీసుకుంటారని సమాచారం.

5. ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా జోనస్

ప్రస్తుతం 'సిటాడెల్' అనే అంతర్జాతీయ సిరీస్​ షూటింగ్​లో బిజీగా ఉన్నారు ప్రియాంకా చోప్రా. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించబోయే బాలీవుడ్ చిత్రం 'జీ లే జరా' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ హాట్ భామ.. మీ ఫంక్షన్​లో చిందేయాలంటే రూ. 2.5కోట్లు సమర్పించుకోవాల్సిందే.

6. హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

బాలీవుడ్​లో మోస్ట్ హ్యాండ్​సమ్ హీరో హృతిక్ రోషన్. ఇక హృతిక్​ డ్యాన్స్​కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం 'విక్రమ్​ వేదా' రీమేక్​లో నటిస్తున్న ఆయన.. ఒక్కో ఈవెంటుకు రూ. 2.5 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.

ఇదీ చూడండి:ప్రాచి దేశాయ్.. నటనతోనే కాదు వివాదాలతోనూ!

ABOUT THE AUTHOR

...view details