తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సినిమాను బ్లాక్​లో టికెట్టు కొని చూశా' - అమర్​ అక్బర్ ఆంటోనీ

'బెల్​బాటమ్' ట్రైలర్ ఆవిష్కరణలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్. తాను బ్లాక్​లో టికెట్టు కొని అమితాబ్ బచ్చన్​ నటించిన 'అమర్​ అక్బర్ ఆంటోనీ (1977)' సినిమాను చూసినట్లు చెప్పుకొచ్చారు.

Akshay Kumar
అక్షయ్​కుమార్

By

Published : Aug 6, 2021, 7:50 PM IST

కరోనాతో దేశవ్యాప్తంగా మూతబడ్డ సినిమా థియేటర్లు.. పలు ప్రాంతాల్లో మళ్లీ తెరుచుకున్నాయి. ఈ క్రమంలో థియేటర్లతో తనకున్న చిన్ననాటి అనుభవాలను పంచుకున్నాడు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్. అమితాబ్ బచ్చన్​..​ 'అమర్​ అక్బర్ ఆంటోనీ(1977)' సినిమాను తాను బ్లాక్​లో టికెట్టు కొని చూసినట్లు తెలిపాడు.

ఎలాగైనా సినిమా చూడాలని..

"దిల్లీలోని థియేటర్లతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను చాందినీ చౌక్​లో జన్మించాను. అక్కడే చాలా సినిమాలు చూశాను. అంబ థియేటర్​లో అమితాబ్​ బచ్చన్​ నటింటిన 'అమర్​ అక్బర్ ఆంటోనీ(1977)'సినిమాను బ్లాక్​లో టికెట్టు కొని చూశాను. ఆరోజు వర్షం బాగా పడుతుంది. నేను ఎలాగైనా చిత్రాన్ని చూడాలని నిశ్చయించుకున్నాను." అని అక్షయ్ చెప్పుకొచ్చాడు.

అమర్​ అక్బర్ ఆంటోనీ తనకెంతో ఇష్టమైన చిత్రం అని తెలిపాడు అక్షయ్. ఆయన నటించిన బెల్ బాటమ్ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణలో ఈ మేరకు ముచ్చటించారు.

'బెల్ బాట‌మ్' ఆగస్టు 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా 2డీ, 3డీ ఫార్మాట్​లో రానుందన్నారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చదవండి:అక్షయ్‌ కుమార్‌తో కన్నీళ్లు పెట్టించిన అజయ్

ABOUT THE AUTHOR

...view details