సినీ విమర్శకులు తన చిత్రాలు ఎందుకు ఇష్టపడరో అర్థమైందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆయన నటించిన 'లక్ష్మి' చిత్రం ఈ మధ్యే విడుదలై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. కానీ క్రిటిక్స్ నుంచి మాత్రం మంచి సమీక్షలు రాలేదు. ఈ విషయమై అక్షయ్ స్పందించారు.
"చాలామంది విమర్శకులు నా సినిమాలను ఇష్టపడరని తెలుసు. దాన్ని గొప్పగా భావిస్తున్నాను. వాళ్లకు వైవిధ్యం నచ్చకపోవచ్చు, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. కానీ, నా దృష్టంతా ప్రేక్షకులను మెప్పించడమే. నా కెరీర్లో అతిపెద్ద ఓపెనింగ్ తెచ్చిన చిత్రం ఇదేనని అంటున్నారు. ఇందులో లింగమార్పిడి చేసుకున్న నటుడు.. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. అలానే ప్యాడ్‌మ్యాన్ (2018), టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ (2017), మిషన్ మంగళ్ (2019) సినిమాలను చూస్తే అవి కూడా ఓ కొత్త కథతో రూపొంది, బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి"