బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. మరో సినిమా ప్రకటించారు. రాఖీ దినోత్సవం సందర్భంగా 'రక్షా బంధాన్' చిత్రంలో నటిస్తున్న వెల్లడించారు. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 5న థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
"ఈ కథ కచ్చితంగా మీ మనసును బలంగా తాకుతుంది. నా కెరీర్లో అత్యంత వేగంగా ఒప్పుకున్న చిత్రమిదే. దీనిని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నాను. ఈ సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ ఆనంద్ ఎల్. రాయ్." అని అక్షయ్ రాసుకొచ్చారు.