బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విభిన్న పాత్రలో నటిస్తున్న సినిమా 'లక్ష్మీ బాంబ్'. దక్షిణాది హారర్ చిత్రం 'కాంచన'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మూవీ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్లో పంచుకున్నాడు కథానాయకుడు. కళ్లకు కాటుక పెట్టుకుంటున్న అక్షయ్ ఫొటో ఆసక్తి రేపుతోంది.
ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకుంటున్న 'లక్ష్మీ బాంబ్' - kanchana
'కాంచన'కు రీమేక్‌గా బాలీవుడ్లో రూపొందిస్తున్న 'లక్ష్మీ బాంబ్' తొలిరూపు విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. 2020 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకుంటున్న 'లక్ష్మి బాంబ్'
కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. మాతృకను తెరకెక్కించిన రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాదిలో అలరించిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఎంత భయపెడుతుందో చూడాలి.
ఇది చదవండి: ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్‌కు చిన్నోడు, పెద్దోడు