2017లో ప్రపంచ సుందరిగా ఎన్నికైన మానుషి చిల్లర్ ఇప్పుడు బాలీవుడ్ తెరపై మెరవనుంది. అక్షయ్ కుమార్ హీరోగా రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ భార్యగా మానుషి చిల్లర్ నటించనుంది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్షయ్‌కు జోడీగా 2017 ప్రపంచ సుందరి - అక్షయ్‌కుమార్ కొత్త సినిమా వార్తలు
అక్షయ్‌కుమార్ హీరోగా చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో కొత్త చిత్రం రానుంది. ఈ సినిమాలో అక్షయ్ సరసన 2017లో ప్రపంచ సుందరిగా ఎన్నికైన మానుషి చిల్లర్ నటించనుంది.
అక్షయ్‌కు జోడీగా 2017 ప్రపంచ సుందరి
ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చంద్రప్రకాష్ బుల్లితెరపై 'చాణక్య' అనే సీరియల్‌కి దర్శకత్వం వహించాడు. మరోవైపు అక్షయ్ కుమార్ లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇవీ చూడండి.. 'మంచి కెరీర్ కావాలంటే సల్మాన్‌ను ఫాలో అవ్వండి'