సుశాంత్ రాజ్ పుత్ మృతితో బాలీవుడ్లో అనేక సమస్యలు తెరపైకి వచ్చాయని అన్నారు స్టార్ హీరో అక్షయ్‌కుమార్. వీటిలో డ్రగ్స్ వ్యవహారం కూడా ఉందని అంగీకరించిన అక్షయ్.. చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరిపై దీన్ని రుద్దడం సరికాదన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా నడుస్తోంది. అయితే ఈ మహమ్మారిని ఎలా తొలగించాలనే విషయమై మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చట్టపరమైన సమస్య. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుని త్వరలోనే దీన్ని నిర్మూలిస్తారు. అయితే మీడియా ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించాలని నా సూచన."