బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబయి పోలీస్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్‌బీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అక్షయ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పోలీస్ ఫౌండేషన్‌కు అక్షయ్ కుమార్ భారీ విరాళం - Akshay Kumar donation to mumbai police
ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధి, ముంబయి మున్సిపల్ కార్పోరేషన్లకు భారీ విరాళాలిచ్చిన హీరో అక్షయ్ కుమార్.. నేడు(సోమవారం).. ముంబయి పోలీస్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళమిచ్చారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
అంతకముందు ఈ విషయంపై ట్వీట్ చేసిన అక్షయ్.. కొవిడ్ విధుల్లో భాగంగా ప్రాణాలర్పించిన హెడ్ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సర్వ్‌లకు నివాళి అర్పించారు. పోలీస్ ఫౌండేషన్‌కు అభిమానులు విరాళం ఇవ్వాలని కోరారు.
కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25కోట్లు విరాళమిచ్చారు అక్షయ్. దీనితో పాటే ముంబయి మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ మొత్తంతో ఉద్యోగులకు పీపీఈ కిట్స్, మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు.