బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తుంటారు. అలాంటిది కరోనా రావడం వల్ల అతడు పూర్తి చేసిన చిత్రాలు కూడా విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇటీవల కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా సినిమాలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కీ చిత్రాలు రిలీజ్ డేట్ ఇదేనంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీటన్నింటిపై స్పష్టతనిస్తూ, శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఆగస్టు 15న రెండు సినిమాలు.. అక్షయ్ కుమార్ క్లారిటీ - Akshay kumar news
ఇండిపెండెన్స్ డే నాడు తన రెండు సినిమాలు వస్తాయంటూ ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని అక్షయ్ కుమార్ తేల్చేశారు. త్వరలో విడుదల తేదీలపై నిర్మాతలు స్పష్టతనిస్తారని పేర్కొన్నారు.
అక్షయ్ కుమార్
"సూర్యవంశీ, బెల్‌బాటమ్ సినిమాల కోసం నా అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నందుకు గర్వంగా ఉంది. వాళ్లకు నేను మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. స్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 15) రోజు ఈ రెండు చిత్రాల వస్తాయనే విషయం కేవలం వదంతులు మాత్రమే. ఆ సినిమా నిర్మాతలు త్వరలో విడుదల తేదీలపై క్లారిటీ ఇస్తారు" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇది చదవండి:ప్రియమణి పాత్రకు ఎఫైర్?.. సీజన్ 2లో సమాధానం