తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​: రా ఏజెంట్​గా అక్షయ్​ యాక్షన్​ - akshay kumar movie updates

అక్షయ్​ కుమార్​ హీరోగా నటించిన 'బెల్​బాటమ్' టీజర్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.

bell bottom
బెల్​బాటమ్

By

Published : Oct 5, 2020, 1:30 PM IST

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన సినిమా 'బెల్‌ బాటమ్‌'. రంజిత్‌.ఎమ్‌.తివారీ దర్శకుడు. సోమవారం టీజర్ విడుదల చేశారు. రహస్యాలను ఛేదించి, దేశాన్ని రక్షించే రా ఏజెంట్​గా ఇందులో అక్షయ్ కనిపించనున్నారు. ఆగస్టు తొలి వారంలో ప్రత్యేక విమానాల్లో స్కాట్లాండ్​ వెళ్లిన చిత్ర యూనిట్​.. అప్పటినుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసింది.

1980లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన స్పై థ్రిల్లర్‌ చిత్రమిది. వాణీ కపూర్‌ కథానాయిక. హ్యుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించనుంది. మోనిషా అడ్వాణీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ 2 ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details