ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'బెల్ బాటమ్'(bell bottom). అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా రంజిత్ ఎం.తివారీ తెరకెక్కించిన చిత్రమిది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్లు తాత్కాలికంగా మూతపడటం వల్ల ఈ చిత్రం డిజిటల్ మాధ్యమం వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగింది. ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా ప్రసారం కానుందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా వాటన్నింటికీ సమాధానం ఇచ్చారు అక్షయ్. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. జులై 27న ప్రేక్షకుల ముందుకు రానునట్లు తెలిపారు.
Bell Bottom: అక్షయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ - అక్షయ్‌కుమార్ బెల్‌బాటమ్ రిలీజ్
'బెల్ బాటమ్' సినిమా థియేటర్లోనే విడుదలవుతుందని స్పష్టం చేసారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్. జులై 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.
అక్షయ్
వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూజ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది.
ఇదీ చూడండి: Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్, భూమి!