తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బెల్​బాటమ్​'లో అక్షయ్.. అదిరిన రెట్రో ​లుక్​ - బెల్​ బాటమ్ సినిమా

కన్నడ సినిమా 'బెల్​ బాటమ్'ను అదే పేరుతో బాలీవుడ్​లో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరో. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

'బెల్​ బాటమ్' సినిమా ఫస్ట్​లుక్

By

Published : Nov 10, 2019, 10:27 PM IST

బాలీవుడ్​లో ప్రస్తుతం బిజీ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. యమస్పీడులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులనే కాకుండా తోటి హీరోలనూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ప్రస్తుతం 'సూర్యవంశీ'తో బిజీగా ఉన్న ఈ నటుడు.. తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కన్నడ హిట్​ 'బెల్​ బాటమ్'ను అదే పేరుతో హిందీలో రీమేక్​ చేస్తున్నాడు. ఆదివారం ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. రెట్రో స్టైల్లో ఉన్న ఫొటో​ ఆకట్టుకుంటోంది.

'బెల్​ బాటమ్' సినిమా ఫస్ట్​లుక్

80ల్లో జరిగిన ఓ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రంజిత్.ఎమ్.తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుంది. 2021 జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details