వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. తాజాగా అతను 'బెల్ బాటమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఈ ఖిలాడీ సరసన నటించేందుకు నుపూర్ సనన్‌ను కథానాయికగా ఎంపిక చేసింది చిత్రబృందం. ఈ యువనటి '1:నేనొక్కడినే' చిత్రంలో నటించిన కృతి ససన్‌కు స్వయానా చెల్లెలు. గతంలో అక్షయ్‌కు జోడిగా మృణాల్ ఠాకూర్‌ను చిత్రబృందం అనుకున్నట్లు పుకార్లు వచ్చాయి.
"ఇది నా మొదటి చిత్రం. ఇంత పెద్ద స్టార్‌తో కలిసి సినిమాల్లో పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ మొదటి రోజు ఆయన్ను చూసి కొంచెం భయపడ్డాను. ఇప్పుడు నాకు సీతాకోక చిలుకలా రెక్కలతో ఎగురుతున్నట్లు ఉంది".
- నుపూర్ సనస్, బాలీవుడ్ యువ నటి