తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రామ్​సేతు' ఆధారంగా అక్షయ్ సినిమా - అక్షయ్​ కుమార్ కొత్త సినిమాలు

అక్షయ్​ కుమార్ మరో సినిమాను ప్రకటించారు. ఈసారి ప్రఖ్యాత 'రామసేతు' ఆధారంగా చిత్రం తీయనున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు.

Akshay Kumar announces new film Ram Setu on Diwali
'రామ్​సేతు' పోస్టర్​.. మాస్​ లుక్​లో హీరో అక్షయ్​

By

Published : Nov 14, 2020, 1:18 PM IST

Updated : Nov 14, 2020, 2:29 PM IST

దీపావళిని పురస్కరించుకుని బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చారు. తన కొత్త సినిమా టైటిల్​ 'రామ్​సేతు' అని ప్రకటించడం సహా పోస్టర్లను విడుదల చేశారు. మెడలో ఎర్రకండువాతో, భుజానికి బ్యాగ్​తో సరికొత్తగా కనిపించారు అక్కీ. బ్యాక్​గ్రౌండ్​లో శ్రీరాముడి ఫొటో కూడా ఉంది. ఈ పోస్టర్​లో కల్పితమా? నిజమా? అనే ట్యాగ్​లైన్​ను జోడించారు.

'రామ్​సేతు' పోస్టర్​

"ఈ దీపావళి, రాబోయే తరాలను కలిపే ఒక సేతువును నిర్మించి, భారతీయులందరిలోనూ రాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఈ మహాకార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకే.. మా ఈ ప్రయత్నం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు"

--అక్షయ్​ కుమార్​, హీరో

ఈ సినిమాకు అభిషేక్​ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్​ భాటియా నిర్మిస్తున్నారు. అక్షయ్ నటించిన హారర్ కామెడీ 'లక్ష్మి' సినిమా.. ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇదీ చూడండి:నా సినిమాలు వాళ్లకు నచ్చవు: అక్షయ్ కుమార్

Last Updated : Nov 14, 2020, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details