ముగ్గురు స్టార్ హీరోలు9sooryavanshi rohit shetty movie) ఒకే సీన్‌లో ఉంటే ఆ సినిమాకుండే క్రేజే వేరుగా ఉంటుంది. ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో మరో హీరో అతిథి పాత్రలో తళుక్కుమంటూ సందడి చేస్తుంటే అభిమానులు పండగ చేసుకుంటారు.
అక్షయ్, అజయ్, రణ్‌వీర్ కలిసి మరోసారి! - రణ్‌వీర్ సింగ్ సూర్యవంశీ
ఇప్పటికే 'సూర్యవంశీ' సినిమాలో కలిసి నటించిన అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగణ్, రణ్‌వీర్ సింగ్.. మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు స్టార్ హీరోలను 'సింగం 3'లో చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట దర్శకుడు రోహిత్‌శెట్టి.
ఇటీవల అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రోహిత్‌శెట్టి తెరకెక్కించిన 'సూర్యవంశీ'(sooryavanshi akshay kumar release date) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకుంటూ చిత్రసీమలో కొత్త ఉత్సాహం నింపుతుంది. ఇందులో అజయ్‌దేవగణ్, రణ్‌వీర్‌సింగ్ అతిథి పాత్రల్లో కనిపించి అలరించారు. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురినీ ఒకే చిత్రంలో చూపించబోతున్నారట దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగణ్ హీరోగా 'సింగం' సిరీస్‌లో రానున్న మూడో చిత్రం 'సింగం 3'(Ajaydevgn singham 3 movie). పోలీస్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలోనే రణ్‌వీర్, అక్షయ్‌కుమార్ అతిథి పాత్రల్లో మెరబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అప్పుడు రవీనా.. ఇప్పుడు కత్రినా