తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కప్పకు భయపడ్డ యాక్షన్​ హీరో అక్షయ్​ - అక్షయ్​కుమార్​

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​ కుమార్​.. ఓ కప్పను చూసి భయపడిపోయానని తెలిపారు. తన ఫోన్​కు ఛార్జింగ్​ పెట్టడానికి ఓ కరెంట్​ ప్లగ్​ దగ్గరకు వెళ్తే.. ఆ సాకెట్​లో ఓ కప్ప దూరి ఉండటం చూసి తాను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డానని వెల్లడించారు.

akshay
అక్షయ్​

By

Published : Jan 2, 2021, 10:27 PM IST

Updated : Jan 2, 2021, 10:57 PM IST

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ పోరాటాలు చేయడంలో దిగ్గజం. అయితే అలాంటి అక్కీ ఓ కప్పకు భయపడ్డారు. ఈ విషయం తెలియాలంటే ఆయన చెప్పిన సంగతేమిటో చుద్దాం.

తాజాగా అక్షయ్‌ తన ఫోన్‌కు ఛార్జింగ్​ చేయడానికి ఓ కరెంట్‌ ప్లగ్‌ దగ్గరకు వెళ్లారు. ఆ సాకెట్​లో ఓ కప్ప దూరి ఉండటం వల్ల ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారట. ఇదే విషయాన్ని తన ఇన్​స్టాలో షేర్‌ చేస్తూ.. 'నా ఫోన్‌ను ఛార్జ్​ చేద్దాం అని చూశా. కానీ అక్కడ స్థలాన్ని మొత్తం కప్ప ఆక్రమించింది. నేనే వేరోచోటును వెతుక్కోవలసి వచ్చింది' అని తెలిపారు.

శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన '2.ఓ' చిత్రంలో ఎన్నో తుపాకీలను సైతం ఎదుర్కొన్న పక్షిరాజాకి ఇంత కష్టం ఎలా వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్‌ ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో 'అత్రాంగి రే' చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటించిన 'బెల్‌బాటమ్‌', 'సూర్యవంశీ' చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పృథ్వీరాజ్‌ అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Last Updated : Jan 2, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details