అసోంలో వరదలకు చాలా మంది నిరాశ్రయులవగా ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కులో జంతువులకు ఆవాసం కరువైంది. వర్షాల ధాటికి సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. తన వంతు సాయంగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించాడు.
అసోం వరద బాధితులకు అక్షయ్ భారీ సాయం - అసోం బాధితులకు 2 కోట్లు
అసోంలో భారీ వర్షాలకు నిరాశ్రయిలైన వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తనవంతు సాయంగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించాడు. ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కుకు కోటి, సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
అసోం వరద బాధితులకు అక్షయ్ భారీ సాయం
ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కుకు కోటి రూపాయలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అంతేకాకుండా తన అభిమానులు కూడా తోచినంత సహాయం చేయాలని పిలుపునిచ్చాడీ స్టార్ హీరో. అసోంలో కుండపోత వర్షాలకు సుమారు 30 జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.