బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్.. వినూత్న కథల్లో నటించడం.. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంటాడని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ చెప్పాడు. సోమవారం జరిగిన 'గుడ్ న్యూస్' ట్రైలర్ విడుదల సందర్భంగా పై విషయాలు మాట్లాడాడు.
అక్షయ్‌తో భారీ బడ్జెట్ సినిమా తీయాలనుకున్నానని, కానీ ఈ హీరో.. కామెడీ నేపథ్య కథను ఎంచుకున్నాడని కరణ్ అన్నాడు.
"రిషికేష్ ముఖర్జీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటివి తీయాలని అనుకుంటూ ఉంటాను. కానీ 'ధర్మ ప్రొడక్సన్స్'.. ఇప్పటివరకు అలాంటి చిత్రం చేయలేదు. ముందుగా అక్షయ్‌తో పెద్ద సినిమా తీయాలనే అనుకున్నాను. కానీ అతడు 'గుడ్‌న్యూస్'ను ఎంచుకున్నాడు. బడ్జెట్ ఎంత? దర్శకుడు ఎవరు? అనేది అక్షయ్‌కు అవసరం లేదు. ఈ హీరో.. కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు, అందుకే ఎక్కువగా కొత్త దర్శకులతో పనిచేస్తుంటాడు"