కోలీవుడ్ హీరో విజయ్ 'తుపాకీ' సినిమాలో చిన్న పాత్రలో నటించి తప్పుచేశానని అంటోంది నటి అక్షరగౌడ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించింది. నిజానికి తాను హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్ర పోషించాల్సిందని తెలిపింది.
"తుపాకీ సినిమాలో మంచి విషయం ఏదైనా ఉందంటే అది విజయ్, మురగదాస్ సర్, సంతోష్ శివన్ సర్. ఇది కాకుండా మరేం లేదు. నేను చేసిన పాత్ర వల్ల చింతిస్తున్నాను. నిజానికి కాజల్ స్నేహితురాలి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ తర్వాత మార్చేశారు. అయినాసరే నాకెలాంటి కోపం లేదు. ఒకవేళ ఆ చిత్రయూనిట్.. మరో సినిమా కోసం ఇప్పుడు పిలిచానా సరే పనిచేస్తా"