సికింద్రాబాద్ గణపతి ఆలయంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి నాగ్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. నూతన సినిమాకు సంబంధించి గణేశునికి మొక్కులు సమర్పించినట్లు తెలిపారు.
గణేశుని సన్నిధిలో నాగ్ కొత్త సినిమాకు క్లాప్ - secunderabad ganesh temple
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో సందడి చేశారు. ప్రస్థానం ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన సినిమా షూటింగ్‌కు వినాయకుడి సమక్షంలో మంత్రి తలసాని తొలి క్లాప్ కొట్టారు.
ప్రస్థానం ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో.. రామ్మోహన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు నాగార్జున చెప్పారు. బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సోమవారమే పూర్తయిందని, తర్వాత రోజే మరో కొత్త సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని నాగ్ అన్నారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయం ఎంతో మహిమగలదని, ఇక్కడ షూటింగ్ ప్రారంభిస్తే సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పూజ అనంతరం మంత్రి తలసాని.. నాగ్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు నాగ్ తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని సూచించారు. మన్మథుడితో ఆలయంలో భక్తులతో పాటు పోలీసులు కూడా ఫొటోలు దిగారు.
- ఇదీ చూడండి :'బ్రహ్మాస్త్ర' పూర్తి చేసిన నాగ్